BREAKING NEWS:
airstrike-on-rebel-held-nor

సిరియాలో యుద్ధ విమానాల దాడి…44మంది మృతి…

46

సిరియాలో తిరుగుబాటు చేసిన వాయువ్య గ్రామంపై యుద్ధ విమానాలు భారీ ఎత్తున దాడికి పాల్పడ్డాయి, బ్రిటన్ ఆధారిత సిరియన్ అబ్సర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం జార్ధాన గ్రామంలో ఆరుగురు పిల్లలు, 11 మంది మహిళలు సహా మొత్తం 44 మంది మృతి చెందగా 80 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చాలా బాధితులు ఇంకా రాళ్ల కిందనే ఉన్నారని, గాయపడిన వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని తెలిపింది. ఈ దాడులు సూర్యాస్తమయం తరువాత ముస్లింలు ఉపవాస అనంతరం జరిగిందని వెల్లడించారు.

airstrike-on-rebel-held-nor

ఇటీవలి కాలంలో దేశంపై తిరుగుబాటు జరుపుతున్నప్పటినుంచి యుద్ధవిమానాల దాడులు సాధారణంగా జరుగుతూనే ఉన్నాయని నిన్న జరిగిన దాడిలో ఎక్కువ మంది చనిపోయారని తెలిపింది. గత రెండు సంవత్సరాల నుంచి దాడుల తీవ్రతను అరికట్టేందుకు వేలాదిమంది సిరియన్లు రష్యా, టర్కీ మరియు ఇరాన్ కు వలస బాట చేపడుతున్నారు.