telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు ఆరోగ్యం రాజకీయ వార్తలు

చంద్రబాబు నాయుడు తో సమావేశం అయన ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏఐ, మెడ్టెక్ ఏ విధంగా దోహదపడతాయనే అంశాలపై చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

ప్రభుత్వం, ఏఐ మెడ్ టెక్ ఫౌండేషన్‌ తో కలిసి పరస్పర సహకారంతో ఆరోగ్య రంగంలో మరింత మెరుగైన మార్పులకు కృషి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కలపాల కూడా విలువైన సూచనలు చేశారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు శాలువాతో సత్కరించి, తిరుమల శ్రీవారి జ్ఞాపికను బహుకరించారు.

Related posts