telugu navyamedia
వార్తలు సామాజిక

సెప్టెంబరు 15 నుంచి విద్యాసంవత్సరం: ఏఐసీటీఈ

AICTE New Delhi

కరోనా ప్రభావం అన్నీ రంగాలను కుదిపేసింది. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేశారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కావలిసి ఉండగా ఆ పరిస్థితులు కనబడడం లేదు. ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) పేర్కొంది. ఈ మేరకు సవరించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ షెడ్యూల్‌ను సవరించి కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను సవరించింది.

ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. మిగతా విద్యార్థులకు మాత్రం ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును జులై 15 వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది.

Related posts