telugu navyamedia
తెలంగాణ వార్తలు

తల్లిదండ్రులపై ప్రజాప్రతినిధి దాష్టీకం..

ప్రజాప్రతినిధిగా పదుగురికి మంచిని చెబుతూ ఆదర్శంగా నిలవాల్సిన ఓ మునిసిపల్ ఛైర్మన్ జన్మనిచ్చిన తల్లిదండ్రులపై కాఠిన్యాన్ని ప్రదర్శించాడు. ఆస్తికోసం అమ్మానాన్నలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

కొడుకు ప్రజాప్రతినిధిగా ఉన్నాడని ఓపికపట్టిన తల్లిదండ్రులు… సహనం కోల్పోయారు. ఓపిక నశించింది. కొడుకు వేధింపులు తట్టుకోలేక నేరుగా ఫస్ట్ క్లాస్  మెజిస్ట్రేట్ కు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కన్నకొడుకునుంచి ప్రాణ హాని ఉందని తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకున్నారు. ఈఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది.

ఎమ్మిగనూరు మునిసిపల్ ఛైర్మన్ డాక్టర్ యస్ రఘు ఆస్తికోసం నానా రభస చేస్తున్నాడని ఆయన తల్లి సరోజ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. కోర్టు, పోలీసు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ తల్లికి ఎలాంటి న్యాయం చేస్తారోనని ఆసక్తిగా మారింది.

Related posts