telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తికరంగా “ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ” ట్రైలర్

Agent-Sai-Srnivas-Athreya

“డీ ఫర్‌ దోపిడీ”, “లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్‌” సినిమాల్లో నటించిన న‌వీన్ పోలిశెట్టి హీరోగా “ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రం తెరకెక్కింది. స్వ‌రూప్ ఆర్ఎస్‌జే ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ ట్రైలర్ తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ చేతుల మీదుగా విడుదలైంది. ఈ ట్రైలర్ లో కామెడీతో పాటు ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయి. ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించే నేపథ్యంలో షాకింగ్ విష‌యాలు తెలుసుకున్న న‌వీన్… ఆ కేసును ఎలా చేధించాడనేది సినిమా కథ. రాహుల్ యాద‌వ్ న‌క్క నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓసారి వీక్షించండి.

Related posts