telugu navyamedia
Uncategorized

కరోనా సెకండ్ వేవ్..అక్కడ మరోసారి లాక్ డౌన్

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. ఈ వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది కరోనా వైరస్ బారిన పడగా.. పలుగురు ప్రజాప్రతినిధులు స్థైతం కరోనా తో బలి అయ్యారు. ఇప్పుడు కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందని అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నయి. తాజాగా అదే బాట పట్టింది ఇంగ్లాండ్ కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఇంగ్లాండ్ మరోసారి లాక్ డౌన్ విధించారు. డిసెంబర్ 2 వరకు లాక్ డౌన్ ఉంటుందని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. మరోసారి లాక్ డౌన్ ఎవరు కోరుకోరని కావున విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో ఇంగ్లాండ్ లో ఏకంగా 22 వేల మంది కరోనా బారిన పడ్డారు. అందులో 326 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించారు.

Related posts