telugu navyamedia
తెలంగాణ వార్తలు

బండి సంజయ్‌ పాదయాత్రలో హై టెన్షన్‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంజయ్‌ పాదయాత్రలో​ బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో ఒకరినొకరు కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో కొంత మందికి దెబ్బలు కూడా తగిలాయి.

Tension Prevails in Bandi Sanjay's Praja Sangrama Yatra in Zaffergadh

దీంతో, ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి ఉద్రిక్తతకు దారితీయడంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి రెండు పార్టీలను కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక, లాఠీఛార్జ్‌ కారణంగా కొందరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదిలా ఉండగా.. హైకోర్టు అనుమతులతో పాంనూర్‌ నుంచి బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉప్పుగల్‌, కోనూర్‌, గరిమిళ్లపల్లి, నాగాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. శనివారం భద్రకాళీ ఆలయం వద్ద మూడో విడతలో పాదయాత్ర ముగియనుంది.

Telangana BJP Chief Bandi Sanjay Completes 1,000 km Year After Starting  Three-phase 'Padayatra'

ఈ సంద‌ర్భంగా ఆగస్టు 27న బీజేపీ భారీ సభ నిర్వహించతలపెట్టింది. అయితే, ఆ సభకు అనుమతిని కాలేజీ ప్రిన్సిపల్ నిరాకరించారు. పోలీసుల నుంచి తమకు సమాచారం లేదని, అందుకే సభకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావాల్సి ఉంది.అయితే, అనుమతి నిరాకరణపై బీజేపీ హై కోర్టుకు వెళ్లింది. దీనిపై కోర్టు నిర్ణయం నేడు రానుంది.

Related posts