After liquor bihar plans to ban khaini

ఇకపై పోగాకు ఉత్పత్తుల నిషేధం…

93

బీహార్ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నితీష్ కుమార్ సర్కారు మరో సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్య దృష్ట్యా గత ఏడాది మే 21 వ తేదీన గుట్కాను నిషేధిస్తూ సంచలనమైన నిర్ణయాన్ని అమలు చేశారు, అలాగే మద్యం కూడా నిషేదించారు. నితీష్ కుమార్ సర్కారు ఇప్పుడు ఆ నిషేధం ఖైనీకి కూడా అమలు చేయాలని యోచిస్తోంది.

2016-17 సంవత్సరంలో జరిగిన ప్రపంచ పొగాకు ఆడిట్ సర్వేలో దాదాపు 20.4 శాతం కి పైగా ప్రజలు ఖైనీ తినేందుకు అలవాటుపడ్డారని తేల్చారు. క్యాన్సర్ తో పాటు అలసత్వం, ప్రేగు వ్యాధులు ఇంకా పలు వ్యాధుల బారిన పడి చాలామంది మరణిస్తున్నారని, ఇలాంటి వ్యాధులకు కారణమైన ఖైనీ విక్రయాలను కూడా నిషేదించాలని సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపింది. ఖైనీ నిషేదానికి వీలుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగవ్వడానికి ఈ నిషేధాన్ని వెంటనే అమలు చేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కేంద్రం మద్దతు తో వీలైనంత త్వరలో ఆదేశాలు జారీ చేయాలని బీహార్ అధికారులు నిర్ణయించుకున్నారు.

ఈ నిర్ణయం కేవలం బీహార్ కి మాత్రమే అమలవుతుందో లేదా దేశ ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి మొత్తంలో పోగాకు, మద్యం తయారీ నిలిపివేస్తుందా అనే యోచనలో పలు చర్చలు జరుగుతున్నాయి.