telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేపు సీఎం కేసీఆర్‌ ఏరియల్ సర్వే..

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్  రేపు గోదావరి నది వరద ప్రభావిత ప్రాంతాల్లో  ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో సీఎం ఏరియల్ సర్వే కొనసాగనుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో దెబ్బతిన్న పంటలను, నీట మునిగిన గ్రామాలతో పాటు ప్రాజెక్టులను కూడా ప‌రిశీలించ‌నున్నారు. 

సీఎం కేసీఆర్‌తో పాటుగా సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు ఈ ఏరియల్ సర్వేలో పాల్గొనున్నారు.  గోదావరి పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు ఎలా కొసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. పునరావాస కేంద్రాల వద్ద బాధితులతో కేసీఆర్ మాట్లాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సీఎం చేపట్టే ఏరియల్ సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్‌ను ఫైనల్ చేయనుంది.

మరోవైపు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భద్రాచలానికి వెళ్లనున్నారు. వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరశీలించనున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్‌ నుంచి రైలులో గవర్నర్‌ తమిళిసై.. భద్రాచలానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయానికి భద్రాచలం చేరుకోనున్నారు

Related posts