telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అదాశర్మకు పార్టనర్ దొరికాడంట…

‘ఐ ఫౌండ్ మై పార్టనర్’ అంటూ ఓ వీడియోను అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. దీంతో వెంటనే ఆమె అభిమానులు పార్టనర్ ఎవరా అని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపించారు. అయితే ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియోలో అదా భాగస్వామిని చూసినవాళ్లకు మాత్రం షాక్ తగిలింది. ఆ వీడియోలో అదాశర్మతో పాటు మరొకరు డాన్స్ వేస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు. అదాశర్మనే. అవును అదా అద్దం చూస్తూ డాన్స్ వేసింది. అద్దంలో తన ప్రతిబింబమే.. తన పార్టనర్ అంటూ అర్థం వచ్చేలా ఈ ముద్దుగుమ్మ పోస్టు పెట్టింది. దీంతో అదా వీడియో చూసినవారంతా ఏంటి అదా ఇంత షాక్ అయ్యారు. అదాశర్మ ఓ బిజినెస్ మేన్‌తో డేటింగ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లును అదా కొట్టి పారేసింది.

Related posts