telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నూనిగాడు ఓం బూమ్ ఫట్ అంటగా… నాని సినిమా ఫై శ్రీరెడ్డి కామెంట్

Srireddy

విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన ‘హిట్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేసింది. ‘హిట్టా ఫట్టా.. నూనిగాడు ఓం బూమ్ ఫట్ అంటగా’ అని సెటైర్ పేల్చింది. అయితే నాని నిర్మించిన హిట్ సినిమాకు శ్రీరెడ్డి పెట్టిన కామెంట్ సింక్ అవుతోంది. అంటే ఆమె నానిపై కామెంట్స్ చేసినట్టేగా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీరెడ్డి మీటూ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నాని పేరును కూడా బయటపెట్టి షాకింగ్ విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నాని కూడా తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. అందుకే ‘బిగ్ బాస్ 2’లో తనకు అవకాశం రానివ్వకుండా చేసాడని ఆరోపించింది. కానీ నాని మాత్రం ఈ వార్తలను ఖండించాడు. అనవసరంగా తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేకాదు శ్రీరెడ్డిని లీగల్ నోటీసులు కూడా పంపించారు. దీనికి శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘కచ్చితంగా మనం న్యాయ పరంగానే పోరాడదాం’ అని సవాల్ చేసారు. ఇవన్నీ ప్రస్తుతం సర్దుమణిగాయి అనుకుంటే.. శ్రీరెడ్డి మాత్రం అప్పుడప్పుడూ ఇలా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టి మళ్లీ గెలకాలని చూస్తూ ఉంటుంది.

Related posts