telugu navyamedia
సినిమా వార్తలు

100 కిలోల బరువును సునాయాసంగా ఎత్తిన సమంత

Samantha images

కాలం మారుతున్న కొలది మనుషుల ఆలోచనల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. ఇక ఇప్పటి నటీనటులైతే ఫిట్నెస్ కు ఎంతగా ప్రాధాన్యతనిస్తున్నారంటే… పెళ్ళైనా… మూడు పదుల వయసు దాటుతున్న తన శరీర సౌష్టవం తరగకుండా నాజూకైన శరీరాన్ని సొంతం చేసుకోవడానికి జిమ్ లలో వర్కౌట్లు చేస్తూ బాగానే శ్రమిస్తున్నారు. ఈ జాబితాలో సమంత కూడా చేరిపోయింది. నాగచైతన్యతో పెళ్లికి ముందు అగ్రహీరోలందరితో నటించిన సమంత ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. అందుకు అనుగుణంగా ఆమె తనను తాను మలుచుకుంటున్న తీరు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫిట్ నెస్ కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చే సమంత తాజాగా 100 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి వీక్షకులను విస్మయానికి గురి చేసింది. తన జిమ్ వర్కౌట్ లో భాగంగా సమంత అంత బరువును ఎత్తుతూ వ్యాయామం చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Related posts