telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలు లీక్… చేసింది భర్తేనట…!

Malayala-Actress-Priyanka

“వెయిల్” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై ఆ తరువాత “సెంగాత్తుభూమియిలే”, “వానం పార్తు సీమయిలే” వంటి తమిళ చిత్రాలతో పాటు మలయాళంలో కూడా నటించిన మలయాళ నటి ప్రియాంక. అయితే పెళ్ళి చేసుకున్న మూడేళ్ళకు భర్తతో విడాకులు తీసుకుంది ఈ అమ్మడు. 2012లో దర్శకుడు లారెన్స్ రావ్ ని పెళ్లి చేసుకుంది ప్రియాంక. చాలా కాలం ప్రేమ తరువాత వీరి వివాహం జరిగింది. అలాంటిది అసలు భర్తతో ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని అప్పుడు బయటపెట్టలేదు.

తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది ప్రియాంక. పెళ్ళి అనంతరం మూడేళ్లపాటు ఈ ప్రేమ జంట సంతోషంగానే ఉన్నారు. వీరికి ముకుందరామ్ అనే కుమారుడు కూడా పుట్టాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే తమ ఆంతరంగిక ఫోటోలను తన భర్తే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడని, అది నచ్చకే విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేసింది ప్రియాంక. అంతేకాదు పెళ్ళి తరువాత సినిమాలకు దూరంగా ఉండాలనే కండిషన్ కూడా పెట్టాడట. ఈ కారణాలతో అతడితో విడిపోవాల్సి వచ్చిందని పేర్కొంది ప్రియాంక.

Related posts