telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా కాటుకు స్టార్ హీరోయిన్ భర్త బలి

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.  అయితే తాజాగా తమిళ, కన్నడ, తెలుగు భాషాలలో ప్రముఖ హీరోయిన్ గా రాణించి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన నటి మాలా శ్రీ భర్త.. సినీ నిర్మాత కునిగల్ రాము (52) కరోనా కారణంగా మరణించారు. వారం కింద కరోనా పాజిటివ్ రాగా.. బెంగుళూర్ నగరంలోని మత్తికెరెలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. తమకూరు జిల్లా కునిగల్ కు చెందిన రాము.. కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగారు. వీరికి ఓ కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక రాము మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related posts