telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగు, తమిళ్ లో రీఎంట్రీ… భయపడుతున్న స్టార్ హీరోయిన్…!

Ileana

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో పలు సూపర్ డూపర్ హిట్స్ తో స్టార్ స్టేటస్ పట్టేశాక బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. అక్కడ కొన్ని సినిమాలు చేసి.. తిరిగి టాలీవుడ్ వంక చూస్తోంది. ఈ మేరకు ఇటీవలే రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి నాగార్జున సరసన నటించే మరో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చారని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తమిళ్ భాషల్లో రీ ఎంట్రి అంటే భయపడుతోందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పట్లో తెలుగు, తమిళ్ లో సినిమాలు చేయకూడదని ఈ గోవా బ్యూటీ ఫిక్స్ అయ్యిందట . హిందీలో వస్తున్న ఒకటి రెండు అవకాశాలనే వాడుకుంటూ అక్కడే గడిపేయాలని చూస్తుంది ఇలియానా. ఇక పాన్ ఇండియా సినిమాల పైన ఈ భామ ఎక్కువ ఫోకస్ పెడుతుందట. మరి ఈ బ్యూటీ ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చిందో తెలియాల్సి ఉంది.

Related posts