telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిఖిల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ?

anupama

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ’18 పేజెస్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు లాంఛనంగా మొదలైంది. ఇక ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర కోసం పలువుర్ని పరిశీలించిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తారని తెలుస్తోంది.

Related posts