telugu navyamedia
క్రీడలు సినిమా వార్తలు

బుమ్రాతో అనుపమ లవ్… క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Bumrah-and-anupama-parameshwaram

జాతీయ క్రికెట‌ర్ జ‌స్ర్పీత్ బుమ్రా, ద‌క్షిణాదికి చెందిన హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ఉన్నారా? అనే విషయం సోష‌ల్ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో సైతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరిద్ద‌రూ క‌లిసి బ‌య‌ట క‌నిపించ‌లేదు. పార్టీలకు, ప‌బ్‌ల‌కు క‌లిసి తిర‌గ‌లేదు. అయినా వీరిద్ద‌రి గురించి ఇలాంటి వార్త రావ‌డానికి కార‌ణం సోష‌ల్ మీడియా. బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక సినిమా న‌టి అనుప‌మే. అంతేకాదు ఒక‌రు పెట్టే పోస్ట్‌కు మ‌రొక‌రు వెంట‌నే లైక్‌లు కొట్ట‌డం, ఒక‌రి పోస్ట్‌ల‌ను మ‌రొక‌రు షేర్ చేయ‌డం త‌ర‌చుగా చేస్తున్నార‌ట‌. దీంతో నెటిజ‌న్లు వీరి గురించి చ‌ర్చ‌ను షురూ చేశారు. జాతీయ మీడియా సైతం వీరి వ్య‌వ‌హారం గురించి ఆరా తీసే ప్రయత్నం చేసింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అనుప‌మ‌.. బుమ్రా త‌న‌కు మంచి స్నేహితుడు మాత్ర‌మేనని ఇటీవ‌ల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రికీ స్నేహం ఎలా కుదిరిందబ్బా అంటూ అనే సందేహం మాత్రం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది.

Related posts