telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వాళ్లు కూడా మనుషులే… బ్లడీ స్టుపిడ్ పోలీస్

madhavi-latha comments

పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు సినీనటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత. విచిత్రం ఏంటంటే నేను ఈ కామెంట్స్ చేయడం వల్ల జనం నాపై నీచమైన బండబూతులు తిడతారని నాకు తెలుసు. రండి తిట్టడం అంటూ పిలుపునిచ్చి మరీ పోలీసుల్ని తిట్టడం మొదలు పెట్టింది మాధవీలత. తాజా పోస్ట్‌లో ఆమె పోలీసులు ప్రజల్ని వీర బాదుడు బాదుతున్న వీడియోలను పోస్ట్ చేసి.. ‘కమాన్.. మైడియర్ సోషల్ మీడియా హీరోస్.. నీఛమైన కామెంట్స్‌తో నన్ను ఎటాక్ చేయడానికి గెట్ రెడీ’ అంటూ మొదలు పెట్టింది. ‘కారణం తెలుసుకోవాలి అతిక్రమిస్తే కేసులు పెట్టమన్నారు ఇలా కొట్టమననేదు. బ్లడీ స్టుపిడ్ పోలీస్.. మీరు డ్యూటీ చేస్తున్నారు ఓకే. వాళ్లు కూడా మనుషులే మీరు మనుషుల్లా ప్రవర్తించండి. బయటకు వస్తున్న ప్రజలంతా తప్పు చేస్తున్నట్టు కాదు. కారణం లేకుండా బయటకు రారు ఒకవేళ వస్తే ఇలా దారుణంగా కొట్టే బదులు వారికి జరిమానా విధించండి. వాళ్లు చేసిన తప్పుకు జరిమానా సరిపోతుంది. ఇలా సైకోల్లా ప్రవర్తించాల్సిన అవసరం లేదు’ అంటూ పోలీసులపై రెచ్చిపోయింది మాధవీలత.

అయితే మాధవీలత ముందుగా భావించినట్టే ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నేను లేడీస్‌ని చాలా గౌరవిస్తారు.. మాటలు కూడా గౌరవంగానే ఉంటాయి. కాని నువ్వు పోలీస్‌లను బ్లడీ స్టుపిడ్ పోలీస్ అంటావా? కాస్త గౌరవంగా మాట్లాడు. పోలీస్‌లు పనిలేక ఇలా రోడ్లు మీదికి వచ్చి డ్యూటీ చేస్తున్నారా? వాళ్లకు ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్లకి కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉంది. కాని ఫ్యామిలీస్‌ను వదిలేసి దేశం మొత్తం సెలవుల్లో ఉన్నా వాళ్లు మాత్రం పగలూ రాత్రి కాకుండా ఉద్యోగం చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకోసం పనిచేస్తున్నవాళ్లపై నోరు పారేసుకోకు’ అంటూ ఘాటుగా స్పందించాడు ఓ నెటిజన్. ‘ఇలా ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టడం కాదు.. పోలీసుల్లా నువ్ రోడ్డు మీదికి వచ్చి జనాన్ని నువ్ కంట్రోల్‌లో పెట్టు.. ఓ 24 గంటల పాటు డ్యూటీ చేయి. ఇదే మాట అప్పుడు చెప్పు. అప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి. తన్నితేనే కాని కాని మన జనం వినరు అని నీకే తెలుస్తుంది. దయచేసి బాధ్యతలేని పోస్ట్‌లు పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టుద్దు. పోలీస్ వాళ్ల డ్యూటీ చేయనీయండి. అయినా మీరు పోస్ట్ చేసిన వీడియోలలో పోలీస్‌లు కొట్టడం వెనుక కారణం ఉంది. దుబాయ్ నుంచి వచ్చిన యువకుడు పోలీస్‌ల ముందు హీరోయిజం చూపించే ప్రయత్నం చేశాడు. కొట్టకుండా ఉంటే వినేటైప్ కాదని ఆ వీడియో చూస్తే అర్థమౌతుంది.. అతని ప్రవర్తన కూడా కరెక్ట్ కాదు.. ఇలాంటి కామెంట్స్ చేసే ముందు అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటో గమనించాలి. ఆవేశంలో నోటికొచ్చి మాట్లాడటం.. నవ్వులు పాలుకావడం కాదు’ అంటూ మరో నెటిజన్ చురకలు వేశాడు.

Related posts