telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఘర్షణ” సీక్వెల్ లో నటించడానికి సిద్ధమంటున్న హీరోయిన్

Surya-and-Jyothika

గౌతమ్ మీనన్ “ఘర్షణ” సీక్వెల్ తీస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని హీరోయిన్ జ్యోతిక అన్నారు. `పోన్మగల్ వంధల్` ప్రమోషన్స్ లో భాగంగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ సెషన్ లో ఈ సంగతిని వెల్లడించింది. 2003 సూపర్ హిట్ చిత్రం “కాఖా కాఖా”కు సీక్వెల్ చేయాలని తాను సూర్యా నిర్ణయించుకున్నామని జ్యోతిక పేర్కొంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా “ఘర్షణ”. ఈ సినిమా విజయాన్ని సాధించకపోయినా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ సినిమా 2003లో రిలీజైన “కాఖా కాఖా” అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్. తమిళ వెర్షన్ లో సూర్య, జ్యోతిక జంటగా నటించారు. ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ పవర్ ఫుల్ యాక్టింగ్ ప్రేక్షుకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు గౌతమ్ మీనన్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

Related posts