actor rajababu birthday

రాజాబాబుకు ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’…

19

రాజాబాబు ప్రముఖ నటుడు, అటు టీవీ సీరియల్స్ ఇటు సినిమాలలో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు నటనా రంగంలో. పుట్టింది రామచంద్రపురం, నర్సాపూర్ పేట, తూర్పుగోదావరి జిల్లాలో అయినా వారి ఉద్యోగార్థం కాకినాడ లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె.

actor rajababu birthdayసినిమాలలో అయినా టీవీ సీరియల్స్ లో అయినా సహజంగా నటించటమే రాజాబాబుకు మొదటినుండి ఉన్న ఒక ప్రత్యేకత, ఈ శైలే తనని నటన రంగంలో ఉన్నత స్థాయికి తీసుకువచ్చింది. నటన మీద ఆసక్తి బాల్యం నుండే ఉండటంతో అప్పుడే స్టేజీలపై తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు రాజాబాబు. పాఠశాలలో కూడా స్టేజి ఎక్కే అవకాశం వస్తే వదిలిపెట్టేవాడు కాదట…అలా బాల్యంలోనే అనేక ప్రదర్శనలు ఇచ్చాడు రాజాబాబు. నటనతో పాటు కబడ్డీ మరియు షెటిల్ ఆటలంటే వదిలేవాడు కాదు. ఆటలలోను వెనక్కితగ్గే ప్రసక్తే లేదనే నైజం రాజాబాబుది.

actor rajababu birthdayఇక సొంత ఊరిలో పొలాలు ఉండటంతో వ్యవసాయం చేయటం, అక్కడే స్నేహితులతో సరదాగా ఆటలు ఆడటం వారికి ఉన్న అలవాట్లలో ఒకటి. చూడటానికి లడ్డులా అనిపించే రాజాబాబు కు ఇష్టమైన ఆహరం కూడా అటువంటిదే, జంక్ ఫుడ్ లాంటివి బాగా ఇష్టపడతారు. తినటం వరకేనా అంటే కాదు అన్ని రకాల వంటలు కూడా క్షణంలో నలభీమపాకం..అన్నట్టు వండేస్తారు కూడా. వంటలో గురువైతే భార్యేనట.

ఇంకా గుళ్లను సందర్శించడం అంటే ఆసక్తి చూపిస్తారు రాజాబాబు, సూర్య కాల మందిరం, కాకినాడ ను తరచుగా సందర్శిస్తుంటారు. ఇక్కడే సజహంగా స్టేజి షోస్ జరుగుతుంటాయి. స్వర్గం నరకం, దేవుడు చేసిన మనుషులు..తదితర ప్రదర్శనలు ఇక్కడ జరిగాయి.

actor rajababu birthdayరాజాబాబు కు పేరు తెచ్చిపెట్టిన వాటిలో రాధా-మధు సీరియల్ ప్రముఖంగా చెప్పుకోవచ్చు, ఇది అప్పటిలో మా టీవిలో ప్రసారం అయ్యేది. ఈ సీరియల్ లో గోపాలం గా వీరి పాత్ర చక్కటి ఆదరణ పొందింది.

వీరికి పండగలన్నా బహు ప్రీతి, వాటిలో సంక్రాంతి అంటే ఇంకా ఇష్టం ఏమంటే కోడి పందేలతో పాల్గొనటం లాంటి సరదాలకు ఈ పండగ పెట్టింది పేరు కదా. రాజాబాబు తండ్రి సినిమా నిర్మాత కావటం వారు నిర్మించిన చిత్రాలలో దేవుడు చేసిన మనుషులు, స్వర్గం నరకం, రాధమ్మ పెళ్లి మొదలగున్నవి ఉన్నాయి.

2005లో రాజాబాబు కు నంది అవార్డు అమ్మా అనే టెలీ ఫిలిం లో విలన్ పాత్రకుగాను వచ్చింది.

నేడు రాజాబాబు జన్మదినం కావటంతో వారి గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పుకున్నాం…వారికి కూడా నవ్యమీడియా తరుపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.