telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చెన్నైలో కిక్ శ్యామ్ అరెస్టు

Kick-Shyam

ప్రముఖ సినీ నటుడు కిక్ శ్యామ్ ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న శ్యామ్ గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శ్యామ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. ఎక్కువగా ఆయన తమిళ సినిమాల్లో యాక్ట్ చేశారు. రవితేజ హీరోగా చేసిన కిక్ తో శ్యామ్ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.అది సూపర్ హిట్ అవడంతో కిక్ శ్యామ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేశాడు. రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ అన్నగా మెప్పించాడు. కళ్యాణ్ రామ్ కత్తి, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 వంటి సినిమాల్లో శ్యామ్ నటించాడు. ఎక్కువగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సినిమాల్లో కనిపించాడు.

Related posts