telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైబర్ క్రైమ్ పోలీసులకు ఆలీ ఫిర్యాదు

Ali

హీరోగా, కమెడియన్ గా, యాంకర్ గా టాలీవుడ్ లో ఆలీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈ రోజు ఫేక్ అకౌంట్స్ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆలీ పేరు మీద కూడా ఎవరో ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసారు. దానికి 6000 పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అందులో వారు తమకు నచ్చిన విధంగా ట్విట్స్ చేస్తుండటంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు ఆలీ. నిజం చెప్పాలంటే ఆలీకి ట్విట్టర్ అకౌంట్ అసలు లేనేలేదు. ఇదే విషయాన్ని ఆలీ పోలీసులకు కూడా తెలియజేసాడు. సోషల్ మీడియాలో సెలబ్రెటీల పేర్ల మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అందులో తమ ఇష్టానుసారంగా పోస్ట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. దాంతో సెలబ్రిటీలు చిక్కులో పడుతుంటారు.

Related posts