telugu navyamedia
రాజకీయ

జర్నలిస్టులకు అక్రిడేషన్లు కొలమానం కాదు…

తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ జరిపి అక్రిడేషన్ల కార్డులు లేకుండా తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీ చేసి ప్రెస్ అని స్టిక్కర్ వేసుకున్న వాహన దారులకు అక్రీడేషన్ లేకుండా ప్రెస్ స్టిక్కర్ వేసుకోకూడదని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వచ్చిన వార్త పట్ల అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు సీహెచ్.పూర్ణచంద్ర రావు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.

వాస్తవానికి అక్రిడేషన్ కార్డ్ ని ప్రభుత్వం ఒక్కొక్క మీడియా హౌస్ లో కొంతమందికి మాత్రమే నిబంధనలకు లోబడి జారీ చేస్తుందని, అయితే అదే ప్రెస్ స్టిక్కర్ వేసుకోవద్దనేందుకు కొలమానం కాదని,ఆయా మీడియా హౌస్ లు జారీ చేసిన ఆ సంస్థ గుర్తింపు జర్నలిస్ట్ గుర్తింపు కార్డ్ ని పోలీస్,రెవిన్యూ,ఇతర శాఖల ఉద్యోగులకు వలనే కలిగి ఉన్న జర్నలిస్టులను ఆ సంస్థ జారీచేసిన గుర్తింపుకార్డు ని తనిఖీ చెయ్యాలి గాని అక్రిడేషన్ల కార్డ్ కాదన్నారు.

అసలు అక్రిడేషన్ కార్డ్ మీదే ” Accreditation does not confer any official status” అనే నిబంధన ఉంటుందని పైగా ఇది కలిగి ఉన్న వారు ప్రభుత్వ గుర్తింపు కలిగియున్నట్లు కూడా ఎక్కడా పేర్కొన కూడదు అన్న నిబంధన ప్రభుత్వ (ఐ&పి ఆర్ ) జి.ఓ లో కూడా పేర్కొనబడి ఉంటుంది. అలాంటి అక్రిడేషన్ల కార్డు లేని జర్నలిస్టులను ఇబ్బంది పెట్టకుండా సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డులు ప్రమాణంగా తీసుకోవాలన్నారు. ఒకవేళ తనిఖీ చేసిప్పుడు ఆ గుర్తింపుకార్డులు నకిలీవి అయినా, ఒకవేళ ఆ సమయంలో సంస్థ గుర్తింపు కార్డు చూపించ లేకున్నా అలాంటి వారి స్టిక్కర్లు తొలగించవచ్చని పూర్ణచంద్ర రావు విజ్ఞప్తి చేశారు.

అక్రిడేషన్లు అనేవి కొన్ని ప్రభుత్వ సౌకర్యాలు పొందేందుకు గుర్తింపు తప్ప జర్నలిస్ట్ వృత్తికి కొలమానం మాత్రం ఆయా మీడియా సంస్థలు జారీచేసే గుర్తింపు మాత్రమే అని పేర్కొన్నారు…

Related posts