dhadak

“దఢక్” హీరో ఎవరో తెలిస్తే షాకవుతారు..!

27

తొలి సినిమా విడుదలకు ముందే ఫ్యాషన్ ఐకాన్ గా మారింది జాహ్నవి. అయితే వెండి తెరపై ఆమె నటిస్తున్న తొలి చిత్రం “దఢక్” చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఇప్పటివరకు ఫోటోషూట్ లతో అలరించిన జాహ్నవి తన తొలి సినిమాలో అదరగొట్టిందనే చెప్పవచ్చు. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ట్రైలర్ తోనే అభిమానుల మనసుల్ని దోచుకుంటోంది జాహ్నవి.

మరాఠీలో సూపర్ హిట్ అయిన “సైరత్” చిత్రానికి ఇది రీమేక్. ఒక ఊరిలో ధనవంతురాలైన ఒకమ్మాయికి, ఒక సాదాసీదా కుర్రాడికి మధ్య జరిగే ప్రేమకథే చిత్ర ప్రధాన కథాంశం. “సైరత్” మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాల్లో తీశారు. “దఢక్” చిత్రాన్ని రాజస్థాన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ట్రైలర్ లో రాజస్థాన్ యువతిగా జాహ్నవి ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో ఇషాన్ హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్. ట్రైలర్ లో ఇషాన్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇషాన్ కు ఇదే తొలిచిత్రం.  కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 20న విడుదల కానుంది. అయితే చిత్రం విడుదల తరువాత జాహ్నవికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ట్రైలర్ చూసిన సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. తల్లి శ్రీదేవిలాగే జాహ్నవి కూడా “గ్లామర్ క్వీన్”గా నిలబడే అవకాశం ఉంది.