telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

నేడు భారత్ కు .. అభినందన్.. ఢిల్లీకి తల్లిదండ్రులు..

india pilet fater response

నిన్న అంతర్జాతీయంగా పాక్ పై ఒత్తిడి తేవడంలో భారత్ విజయం సాధించింది. దీనితోనే అతి త్వరగా పాక్ కబంద హస్తాలలో ఉన్న భారత పైలెట్ తిరిగి స్వదేశానికి వస్తున్నాడు. అయితే హింసించినట్టుగా వచ్చిన వీడియోలను మరియు పాక్ తనను ఎలా చూసుకుంది అనేదానిపై ప్రాథమిక విచారణ అనంతరం భారత్ ప్రతి చర్యలు ఉండనున్నాయి. భారత భూభాగంలోకి వచ్చిన పాక్ విమానాలను తరుముతూ ప్రమాదశాత్తు పాక్ సైన్యానికి బందీగా చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ ప్రభుత్వం నేడు విడుదల చేయబోతోంది. దౌత్యమార్గాల ద్వారా భారత్ తెచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాక్.. అభినందన్‌ను నేడు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన ఈ ప్రకటనతో దేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.

ప్రస్తుతం చెన్నైలో ఉన్న అభినందన్ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూసేందుకు ఢిల్లీ బయలుదేరారు. గురువారం రాత్రే వారు ఢిల్లీ పయనమయ్యారు. మరోవైపు, పాక్ చెర నుంచి విడుదల కాబోతున్న అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అనుమతి ఇవ్వాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు.

Related posts