abhimanyudu

“అభిమన్యుడు” ట్రైలర్

61

విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్‌ 1న ‘అభిమన్యుడు’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న “అభిమన్యుడు” చిత్రం ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను మంగళవారం విడుదల చేయాల్సి ఉండగా కొని టెక్నీకల్ కారణాల వల్ల ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు ఈరోజు ఈ చిత్రం ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ చిత్రంలో మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.