ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార్ అవార్డు పేరును వైఎస్‌ఆర్ విద్యా పురస్కారాల కింద మార్పు చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోతరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా అవార్డులను ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే ఇవ్వనున్నారు. గతేడాది వరకు ప్రైవేటు బడుల్లో చదివినా ఈ అవార్డులు ఇచ్చారు.
ఈనెల 11న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి రోజున విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలను ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ ఏడాది నుంచి జిల్లాల వారీగా నిర్వహించనున్నారు.