atagallu

జగపతి బాబుకు నారా రోహిత్ వార్నింగ్…!?

11

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై ‘ఆటగాళ్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, దర్శన్ బానిక్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరుచూరి మురళీ దర్శకత్వం వహిస్తుండగా, సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈరోజు ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో నారా రోహిత్ మూవీ స్టార్ గా కనిపిస్తున్నాడు. జగపతి బాబు ఈ చిత్రంలో పవర్ ఫుల్ లాయర్ గా కనిపిస్తున్నాడు. అయితే టీజర్ లో జగపతిబాబు అడిగిన ఓ ప్రశ్నకు “ఇంకొక్క మాట నా అంజలి గురించి తప్పుగా మాట్లాడావంటే…” అంటూ జగపతి బాబును బెదిరిస్తున్నారు. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.


మరి నారా రోహిత్ ఇంతవరకు చేసిన సినిమాలకంటే ఇప్పుడు విభిన్నమైన కథను ఎంచుకున్నారు. మరి ఈ చిత్రంతోనైనా నారా రోహిత్ తన ఖాతాలో విజయాన్ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఈ చిత్రం జులై 5న విడుదల చేయటానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.