aatagadara-siva

“ఆటగదరా శివ” మొదటి పాట విన్నారా ?

14

రాక్ లైన్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో దొడ్డన్న, ఉదయ్ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం “ఆటగదరా శివ”. ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. వాసుకి వైభవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజాగా “ఆటగదరా శివ” చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాట మీకోసం…

జూన్ 4న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. అయితే చంద్ర సిద్ధార్థ్ ఇంతకుముందు ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా మొదలగు వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన “ఆటగదరా శివ” ట్రైలర్ చూస్తుంటే చాలా వైవిధ్యంగా ఉంది. ఇక ఈ చిత్రం జూన్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నీ వైవిధ్యంగా ఉన్నాయి. ఈ చిత్రం ఎలా ఉంటుందో ఉండాలి.