ganesh

సముద్రంలో స్నానానికి వెళ్ళి…!?

23

ప్రకాశం జిల్లా సముద్ర తీరంలో యువకుడు గల్లంతవ్వడం విషాదంగా మారింది. చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరానికి ఈత కొట్టడానికి వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో కొట్టుకుపోయాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే తీరానికి చేరుకొని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

గ్రానెట్ ఫ్యాక్టరీలో పనికోసం నిజామాబాద్ జిల్లా నుంచి మాటూరుకు వచ్చిన ఏడుగురు యువకులు మధ్యాహ్నం సమయంలో ఓడరేవు తీరానికి వెళ్లారు. సముద్ర తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి గణేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న స్నేహితులు చూస్తుండగానే గణేష్ సముద్రంలో కొట్టుకుపోయాడు. దీంతో భయాందోళనలకు గురైన ఆ యువకులు పోలీసులకు సమాచారం అందించారు.

సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ విషయం యువత తెలుసుకోవాలి. సరదాగా గడుపుదామని వెళ్ళినప్పుడు ఆ సరదా విషాదాంతం కాకూడదంటే అలలను గమనిస్తూ తగినంత జాగ్రత్తగా ఉండాలి.