ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరికొత్త దొంగతనం కు ఓ మహిళ పాల్పడింది. ద్విచక్ర వాహన దొంగలు.. ఇంటి దొంగలు … కార్ల దొంగలు ల్యాప్టాప్ దొంగలు … గొలుసు దొంగలు ..పిట్ ప్యాకెట్ దొంగలు.. దొంగతనాలు చేసిన సంఘటనలు ఎన్నో చూశాం. అయితే ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని బల్కంపేట లో ఒక మహిళ వింత దొంగతనానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. అందరూ గాఢ నిద్రలో నిద్రపోయే సమయంలో తెల్లవారు జామున 3 నుంచి మూడున్నర గంటల మధ్యలో ఇంటి ముందు పెట్టుకున్న పూల చెట్లను..పూల కుండీలను దొంగలించిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. కొందరు ఇంటి యజమానులు ఇంటి ముందు పెట్టుకున్న పూల కుండీలను దొంగలించిన సంఘటన సిసి ఫుటేజీలో నిక్షిప్తం కావడంతో ఇంటి యజమానులు ఆశ్చర్యపోయారు. పూల కుండీలను దొంగలించిన మహిళా కోసం అన్వేషణలో పడ్డారు ఇంటి యజమానులు.
previous post
next post