బెజవాడలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. విద్యార్థిని ఇంటికి వెళ్లి మరీ ఆమెపై కత్తితో దాడి చేశాడు.. విజయవాడలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని దివ్య తేజస్విని.. స్థానికుడైన స్వామి.. కొంతకాలంగా ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు.. అయితే, ఆ యువతి అతడి ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ యువతి ఇంటికి వెళ్లిన స్వామి.. కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో.. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతో బాధితురాలు మృతిచెందింది.. ఇక, యువతిపై దాడి చేసిన తర్వాత.. ఉన్మాది కూడా తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. మాచవరం పీఎస్ పరిధిలోని క్రీస్తురాజపురంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఉన్మాది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే..ఈ ఘటనపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నయి. అసలు ఆ యువతికి, స్వామికి మధ్య ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. అన్ని కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
previous post
చంద్రబాబు గజదొంగ..కేసీఆర్, కేటీఆర్ మంచివారు: మోహన్‌బాబు