దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 24వ వర్ధంతి సందర్భంగా నేడు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి, నటులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి సుహాసిని, రామకృష్ణ తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు.
మరోవైపు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఘాట్ చుట్టూ ప్రదక్షిణలు చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు.

