telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్‌డీఎక్స్ లవ్” రిలీజ్ ట్రైలర్… హాట్ హాట్ గా పాయల్

RDX-Love

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌ ప్ర‌స్తుతం “ఆర్‌డీఎక్స్ లవ్” అనే చిత్రం చేస్తుంది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నాయిక ప్రాధాన్య‌త ఉన్న చిత్రంగా ఉంటుంద‌ని స‌మాచారం. ఇటీవలే చిత్ర ఫ‌స్ట్‌లుక్ వెంక‌టేష్ చేతుల మీదుగా విడుద‌లైంది. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ వెరైటీ డాన్స్‌తో ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఈ డాన్స్ హైలెట్ అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది. టీజర్ చూసిన తర్వాత పూర్తిగా పెద్దలకు మాత్రమే అనిపించేలా కట్ చేసారని అర్థమైంది. మరీ ముఖ్యంగా కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమే ఉండేలా టీజర్ కట్ చేసిన దర్శకుడు.. ట్రైలర్స్‌లో మాత్రం పూర్తి వేరియేషన్ చూపిస్తున్నాడు. అసలు టీజర్, ట్రైలర్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా అద్బుతమైన స్ట్రాటజీ చూపించాడు. పాయల్‌ను కేవలం స్కిన్ షో కోసమే ఎంచుకున్నాడేమో అనేంతగా టీజర్ వస్తే.. ట్రైలర్‌లో మాత్రం ఫుల్లుగా సీరియస్ కథ చెప్పాడు. తొలి ట్రైలర్‌లోనే ఇలా చేసాడనుకుంటే ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ కూడా ఇదే చేసి చూపించాడు శంకర్ భాను. ‘RX 100’ చిత్రంలో బోల్డ్ నటనతో అందర్నీ మాయ చేసిన ఈ చిన్నది.. ఇప్పుడు మరోసారి వచ్చేస్తుంది. ఈ సారి యాక్షన్ కమ్ రొమాంటిక్ రోల్ చేస్తుంది పాయల్. హీరో మాదిరే ఈ చిత్రంలో ఫైట్లు కూడా చేసింది. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటస్తున్న ‘వెంకీ మామ’ సినిమాలో కూడా నటిస్తుంది పాయల్. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘డిస్కోరాజా’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Related posts