వైఎస్ జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.10 గంటకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు ఆయన వెళ్లనున్నారు. అనంతరం వైఎస్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. తర్వాత గండి వీరాంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. అలాగే ఉదయం 11.15 గంటలకు జమ్మలమడుగులో రైతు దినోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.


ప్రభుత్వ ప్రకటనలో అన్ని అబద్ధాలే.. జగన్ పై లోకేశ్ విమర్శలు