“కృష్ణగాడి వీర ప్రేమ గాథ” చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. ఇటీవలే “ఎఫ్-2” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ తమిళంలో ధనుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి ఆసక్తికర విషయాలను పంచుకుంది మెహ్రీన్. చిన్నప్పుడు స్కూల్ లో టీచర్ ఒక్కొక్కరినీ వారి గోల్స్ ఏంటో చెప్పమంటే.. అందరూ డాక్టర్, లాయర్, పైలెట్ అని చెబుతుంటే తను మాత్రం హీరోయిన్ అవుతానని చెప్పేదట. అందుకేనేమో 13 ఏళ్లకే కెనడాలో “మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా” టైటిల్ ని సాధించింది. ఇక స్కూల్ లో, కాలేజ్ డేస్ లో టామ్ బాయ్ గా ఉండడంతో ఆమెతో మాట్లాడాలంటే అబ్బాయిలు భయపడేవారని గుర్తు చేసుకుంది.
మెహ్రీన్ పదవ తరగతి చదువుతున్న సమయంలో తన స్నేహితులతో కలిసి మాల్ కి వెళ్లారట. అక్కడ ఓ అబ్బాయి మెహ్రీన్ కి తెలియకుండా ఫోటోలు తీశాడట. అది గమనించిన మెహ్రీన్ వెంటనే సెక్యురిటీ వాళ్లకు సమాచారం ఇచ్చి, ఫోటోలు తీసిన వ్యక్తి దగ్గరకి వెళ్లి మొబైల్ చూపించమని అడిగిందట. కానీ అతడు అందుకు అంగీకరించకపోవడంతో అతడి చెంప పగలగొట్టి, షర్ట్ కాలర్ పట్టుకుందట. వెంటనే ఫోన్ తీసుకొని ఫొటోలన్నీ డిలీట్ చేసిందట. ఇక ఇండస్ట్రీలో తనకు ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురుకాలేదని, ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు అందరూ బాగా ఆదరిస్తున్నారని కితాబిచ్చింది ఈ బ్యూటీ.

