విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం వరదల విషయంలో విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావని.. సమర్థతతో పనిచేయాలనే అభిప్రాయం వ్యక్తంచేశారు. అధికార యంత్రాంగం సమర్థంగా వ్యవహిరించి ఉంటే ప్రాణనష్టం తగ్గేదన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వర్షాలపై వాతావరణశాఖ ముందే హెచ్చరించినా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందన్నారు. వచ్చాయన్నారు. పాలకుల అనుభవ రాహిత్యం, అహంభావం ప్రజలకు శాపమైందని ఆక్షేపించారు. ఊరుకు ఊరే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. విపత్తు సమయాల్లో సమర్థమైన ప్రభుత్వం ఉంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయగలిగితే ప్రాణ, ఆస్తినష్టాలు తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
తిరుపతి సమీపంలోని రాయలచెరువులో ఎప్పుడూ ఇంత నీరు రాలేదనే విషయాన్ని ప్రస్తావించారు. చెరువు నిర్వహణలో ప్రభుత్వం యంత్రాంగం పూర్తి గా విఫలమైందన్నారు.
తక్షణమే రాయల చెరువు తూముల మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు.. ఎంతనీరు వచ్చినా స్వర్ణముఖిలోకి వెళ్లేలా చేయాలని సూచించారు. ఇసుక మాఫియాను నియంత్రించాలన్నారు. వరద ప్రవాహధాటికి స్వర్ణముఖిపై ఉన్న బ్రిడ్జిలన్నీ కొట్టుకెళ్లాయని.. వాటిని పునరుద్ధరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల్లో నాశిరకమైన పనులు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు గేట్లు తెరుచుకోలేదనే వార్తలు కూడా వచ్చాయి. వరదపై తమకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని అక్కడి ప్రజలు చెప్పారు. ముందుగా నీరు విడుదల చేసి ఉంటే పింఛ, అన్నమయ్య ప్రాజెక్టు, కల్యాణి డ్యామ్‌లలో వరద తీవ్రత ఉండేది కాదన్నారు.

