యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం లక్ష్య షూటింగ్ పూర్తయింది.. ఇందులో శౌర్యకు జోడీగా కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నాగశౌర్య కెరీర్లో 20వ చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలో రెండు వైవిధ్యమైన లుక్స్ తో నాగశౌర్య కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా… సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో నాగశౌర్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. లక్ష్య సినిమా జర్నీ మెమోరబుల్ అని.. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తైందని… త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతుంది అంటూ ట్వీట్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ ఫోటోను షేర్ చేశాడు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సందర్భంగా విడుదలయిన వర్కింగ్ స్టిల్‌లో దర్శకుడు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్నారు. కేతిక శర్మతో పాటు మానిటర్ చూస్తూ సీన్ గురించి వింటున్నారు నాగశౌర్య. హీరోనీ, దర్శకుడినీ చూస్తుంటే వాళ్ల మధ్య ఉన్న ర్యాపో ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ తో, ఎంటర్టైనింగ్ వేలో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ తో దీనిని తెరకెక్కించినట్టు దర్శకుడు ధీరేంద్ర సంతోష్ చెబుతున్నారు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో నాగశౌర్య ఆకట్టుకోబోతున్నారని, రెండింటి మధ్య వేరియేషన్ చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకమ’ని అన్నారు.

ఈ సినిమాతోపాటు.. నాగశౌర్య వరుడు కావలెను సినిమాలో నటిస్తున్నాడు.. ఇందులో రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రాచీన విలువిద్య అంశంతో ముడిపడ్డ ఈ సినిమా కథ ఆసక్తికరంగా, వినూత్నంగా ఉంటుందట.

