తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపర్చడమే కాకుండా ఆమోదయోగ్యంగా ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధినీ విద్యార్ధులకు రిజర్వేషన్ కోటా కల్పిస్తూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది.ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే సైతం ఆమోదం తెలిపింది.
ఈ బిల్లు ప్రకారం..యూనివర్సిటీల్లోని వెటర్నరీ సైన్సెస్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ వంటి వృత్తిపరమైన కోర్సుల్లో అన్ని కేటగరీల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది.
ఇకపోతే ..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ వ్యవసాయం రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ… కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలను కేంద్రం ప్రతిపాదించినప్పటి నుంచి… బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అటు ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ చట్టాలను వ్యతిరేకించాయి.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది తమిళనాడు సర్కార్. శాసన సభలో మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సిఎం స్టాలిన్. చట్టాలు రైతుల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్న సీఎం స్టాలిన్… వ్యవసాయ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
అయితే… సీఎం స్టాలిన్ తీర్మానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి ధర్నాకు దిగారు బిజెపి పార్టీ ఎమ్మెల్యేలు.


నన్ను అరెస్ట్ చేసినా భయపడను.. బీజేపీ ముందు తల వంచను: మమతా