ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే భారీ సినిమా అవుతుందని ఎమ్ రత్నం అన్నారు. తాజాగా ఆయన హరిహర వీరమల్లు సినిమా ముచ్చట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ విన్నప్పుడే బడ్జెట్ అంచనా వేశానని, ఎంత ఖర్చు అయిన తగ్గేదే లే.. అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి అయ్యిందన్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకు షూటింగ్ జరుగుతుండగా.. పవన్ కరోనా బారిన పడటంతో షూటింగ్ నిలిచి పోయింది. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే సినిమా షూటింగ్ పునః ప్రారంభించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. చెప్పిన సమయానికే ‘హరిహర వీరమల్లు’ సంక్రాంతికి వస్తుందన్నారు.
previous post


స్నేక్ బాబు… ఏడేళ్ళు వాళ్ళ కూడు తిని కాటు వేస్తావా ? : శ్రీరెడ్డి