telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

గుడ్ న్యూస్ : తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే…ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 948 పాజిటివ్ కేసులు నమోదవగా..1,896మంది కరోనాబారినపడి కోలుకున్నారు. అలాగే 24 గంటల్లో నలుగురు మాత్రమే కరోనా తో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,23,059 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 2,00686 మంది కోలుకున్నారు.

తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 1,275 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 88.2 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 89.96 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 21,098 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 26,027 కరోనా పరీక్షలు నిర్వహించారు. 

Related posts