రాబోయే ఎన్నికల్లో 90కిపైగా స్థానాల్లో టీఆర్ఎస్దే విజయం : సీఎం కేసీఆర్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్దే విజయమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
‘ప్రజలు ఏపాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తూ.. ప్రజా ప్రయోజనాలు రక్షించే ఓ పర్మినెంట్ సంస్థగా టీఆర్ఎస్ నిలబడాలి ఉండాలని తెలంగాణ కోసం అనే కోరిక ఉన్నది.
రాబోయే రోజులు నిర్ణయం చేసి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించి.. నియోజకవర్గ కేంద్రాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్ణయించుకుందాం. ఈ రోజు మనకు సభ్యత్వం ఉన్నది. కార్యకర్తలు ఉన్నారు. నాయకులు ఉన్నారు. అద్భుతంగా పురోగమిస్తున్నాం. ఇంకోమాట మనవి చేస్తున్నా. ప్రజలు ఎప్పుడూ కూడా సునిశితంగా గమనిస్తుంటారు. టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సందర్భంగా దేశ రాజకీయాలు, టీఆర్ఎస్ పాత్ర తదితర అంశాలపై స్పందించారు.