telugu navyamedia
క్రైమ్ వార్తలు

మ‌హారాష్ర్టలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

మ‌హారాష్ర్ట‌లోని సాంగ్లీ జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు పురుగులు మంది తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్‌లోని ఓ ఇంట్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐదు మృతదేహాలు ఒకే చోట, నాలుగు మృతదేహాలు మ‌రో చోట‌ లభ్యమయ్యాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా ..ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

 

Related posts