కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చట్టాలపై ఓ కమిటీని కూడా సుప్రీం కోర్టు వేసింది. అయితే… కమిటీలోని సభ్యులంతా ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చేవారేనని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు 9వ రౌండ్ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ చట్టాలపై రైతుల అభ్యంతరాలకు సవరణ చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదన పంపగా… ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు రైతు సంఘాల ప్రతినిధులు. కర్నాల్‌లో సుమారు 900 మంది రైతులపై ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి సమావేశంలో చర్చ జరగగా…ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా రైతులను భయపెడుతున్నారని పేర్కొన్నారు రైతు సంఘాల నేతలు. బిల్లు ల అమలును కోర్టు నిలిపివేసిందని తెలిపిన కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్…. అభ్యంతరాల పరిష్కారం పై మాట్లాడుకుందామన్నారు. సమస్య పరిష్కారానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని రైతు సంఘాలను కోరారు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్. “నిత్యావసర సరుకుల చట్టం” పై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్… FCI అంతం కాదు.. FCI బలంగా ఉంటుందని స్పష్టం చేసారు.
previous post