ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 771 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,48,230కి పెరిగింది. తాజాగా 1,333 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 20,22,168కి చేరింది. వైరస్ బారినపడి మరో ఎనిమిది మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 14,150కు పెరిగింది.
24 గంటల్లో 45,592 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కరోనాతో చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, వైఎస్సార్ కడపలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. కొత్త కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 153, తూర్పుగోదావరిలో 104 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు.