telugu navyamedia
రాజకీయ

దిల్లీలో ఘ‌నంగా 73వ ‘గణతంత్ర’ దినోత్సవం..

దేశం మొత్తం 73వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కరోనా ఆంక్షల మధ్యన అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు రాజ్ పథ్ మైదానాన్ని సిద్ధం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేరుకున్నారు, అక్కడ యుద్దంలో మరణించిన సాయుధ దళాలకు నివాళులర్పించారు.  కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు త్రివిధ దళాధిపతులు ఆయనకు స్వాగతం పలికారు. భారతదేశం తన 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు రాజ్‌పథ్‌లో సైనిక శక్తిని మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది.

ఈసారి పొగమంచు కారణంగా సాధారణం కంటే అరగంట ఆలస్యంగా ఉదయం 10:30 గంటలకు కవాతు ప్రారంభమైంది . రిపబ్లిక్ డే పరేడ్ నేపథ్యంలో రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ.. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభ‌మైంది.

Traffic restrictions in Delhi on Republic day parade 2018: Delhi Metro services timing; how to avoid 26 January hassles during travel - The Financial Express

ఈసారి దేశవ్యాప్తంగా 480 మందికి పైగా నృత్యకారుల సాంస్కృతిక ప్రదర్శనలు మరియు 21 టేబుల్‌లాక్స్‌తో పాటు, కవాతులో భారత వైమానిక దళం ద్వారా గ్రాండ్ 75 ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లైపాస్ట్ కూడా ఉంటుంది.

మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలు కవాతులో పాల్గొననున్నాయి. తెలుగు రాష్ట్రాల శకటాలకు స్థానం దక్కలేదు. కొవిడ్ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పెద్దలు, ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న 15 ఏళ్లు పైబడిన పిల్లలను మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు.

1950లో ఇదే రోజున దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.

 

 

 

Related posts