నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం జనతా పిక్చర్స్ ” పరివర్తన ” 01-09-1954 విడుదల.
పినిశెట్టి శ్రీరామమూర్తి గారి “అన్నాచెల్లెల్లు” నవల ఆధారంగా నిర్మాత సి.డి.వీరసింహ గారు జనతా పిక్చర్స్ పతాకంపై ప్రఖ్యత దర్శకులు తాతినేని ప్రకాశరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: తాతినేని ప్రకాశరావు, కథ, మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి, పాటలు: అనిశెట్టి సుబ్బారావు, సంగీతం: మోహన్ దాస్, తాతినేని చలపతిరావు, ఫోటోగ్రఫీ: కమల్ ఘోష్, కళ: సి.హెచ్.ఇ.ప్రసాద్, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, ఎడిటింగ్: జి.డి.జోషి, అందించారు.
ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి , రమణారెడ్డి, మిక్కిలినేని, అల్లురామలింగయ్య, దొరైస్వామి, సురభి బాలసరస్వతి, చదలవాడ, పద్మనాభం, జోగారావు, పెరుమాళ్ళు, రామకోటి తదితరులు నటించారు.
సంగీత దర్శకులు మోహనదాస్, మరియు తాతినేని చలపతిరావు గార్ల సంగీత సారధ్యంలో
“కలికాలం యిది కలికాలం ఆకలికాలంరా”
“నందారే లోకమెంతో చిత్రమురా భాయి”
“ఇంత చల్లని వేళ వింత తలపులీవేళ”
“రండోయ్ రండి,రండోయ్ రండి పిల్లలూ,”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్. లు కలిసి నటించిన మూడవ చిత్రం ఇది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ గారు హీరో కాగా అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అన్నాచెల్లెల్లుగా నటించారు.
ఈ సినిమా షూటింగ్ (ఒక సన్నివేశం) కృష్ణాజిల్లా మచిలీపట్నం లో చిత్రీకరించారు.
ఈ చిత్రాన్ని తమిళం లోకి డబ్బింగ్ చేసి 1955 లో “లక్షాధిపతి” పేరుతో విడుదల చేశారు.
ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకున్నది…..