నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్రం మోడరన్ థియేటర్స్ వారి “వీర కంకణం” 16-05-1957 విడుదలయ్యింది.
నిర్మాత టి.ఆర్.సుందరం మోడరన్ థియేటర్స్ బ్యానర్ పై దర్శకుడు జి.ఆర్.రావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రాన్నికి మాటలు, పాటలు: ఆరుద్ర, స్క్రీన్ ప్లే: జి.ఆర్.రావు, సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, ఫోటోగ్రఫీ: జి.ఆర్.నందన్, నృత్యం: వడూరు రామయ్యపిళ్ళై, ఏ.కె.చోప్రా, కళ: ఏ.జె.డొమ్మిక్, సి.కె.జాన్,వి.ఎస్.రావు, కూర్పు: ఎల్.బాలు, అందించారు.
ఈ చిత్రంలోఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, జమున, జగ్గయ్య, గుమ్మడి, రేలంగి, గిరిజ, రమణారెడ్డి, రమాదేవి, పేకేటి శివరామ్, ఇ.వి.సరోజ తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
“కట్టండి వీరకంకణం కట్టండి వీరకంకణం”
“అందాలరాణీ ఎందుకొగానీ ఆనందగీతమే పాడునే”
“వినవే బర్రెపిలా వినవే బర్రెపిల్లా”
“ఆత్మ బలి చేసి నావు,అమరజీవివమ్మా”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రం లో ఎన్టీఆర్ గారికి గాయకుడు ఏ.ఎం.రాజా గారు పాటలు పాడారు. మోడరన్ థియేటర్స్ వారు ఎం.జి.ఆర్,శకుంతల లతో నిర్మించిన “మంత్రి కుమారి” తమిళ చిత్రం ఈ తెలుగు సినిమాకు మాతృక.
సినిమా నిర్మాత టి.ఆర్.సుందరం మోడరన్ థియేటర్స్ బ్యానర్ పై మొత్తం 100 సినిమాలు నిర్మించారు. అందుకే ఆయన శత చిత్ర నిర్మాత అయ్యారు.
ఈ జానపదచిత్రం యావరేజ్ విజయం సాధించి పలుకేంద్రాలలో (50 రోజులు) అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నది.
ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం… బాలకృష్ణ వ్యాఖ్యలపై సి.కళ్యాణ్