63-years-women-gave-birth-to-baby

ఏవయసులోనైనా…సంతానమా…?

68
ఒక పక్క హడావుడి బ్రతుకులు, మరోపక్క పసలేని ఆహరం ఈ రెండింటితో రోజురోజుకు మనిషి ఆయుర్దాయం పడిపోతుంది, అలాగే జన్మనిచ్చే శక్తిసామర్ద్యాలు కూడా క్షిణించి పోతున్నాయి.  దీనితో సంతాన సాఫల్య కేంద్రాలు కూడా అనేకం తయారయ్యాయి, అవి ఎంత వరకు  ఫలితాలను ఇస్తున్నాయా తెలియదు కానీ మొత్తానికి ఓ వయసు మళ్లిన దంపతులకు ఓ బిడ్డ పుట్టింది.
63 ఏళ్ల వయసులో ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అవును మీరు వింటున్నది నిజమే కోయంబత్తూర్ కి చెందిన ఒక దంపతులకు పెళ్లయి 42 ఏళ్లు అయింది కానీ సంతానం లేదు, సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేశారు అయినా ఏమాత్రం ప్రయాజనం కలగలేదు. దీనితో విసుగు చెందిన దంపతులు చివరిగా  పళనిలోని ‘బాలాజీ ఫెటిలైజేర్’ సెంటర్ ను ఆశ్రయించారు. డాక్టర్ చింతామణి బృందం మహిళలకు ‘విట్రో ఫెటిలైజేషన్ అండ్ యంబ్రో ట్రాన్సఫర్ ‘ విధానం ద్వారా సంతానం ఉత్పత్తి చికిత్సను అందించారు. దానికి ఫలితంగా 63 ఏళ్ల మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ఇది దేశ వైద్య చరిత్రలో  ఒక అరుదైన రికార్డు గా డాక్టర్లు చెప్తున్నారు.