నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సూపర్ హిట్ జానపద చిత్రం విజయావారి “జగదేకవీరుని కధ” 09 ఆగస్టు 1961 విడుదలయ్యింది.
నిర్మాత – దర్శకుడు కె.వి.రెడ్డి గారు విజయా సంస్థ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: కె.వి.రెడ్డి, కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు, సంగీతం: పెండ్యాల, ఫోటోగ్రఫీ: మార్కస్ బార్ట్లే, కళ: గోఖలే, కళాధర్, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, ఎడిటింగ్: కళ్యాణ సుందరం, అందించారు.
ఈ చిత్రంలో ఎన్. టి.రామారావు, బి.సరోజాదేవి, ఎల్.విజయలక్ష్మి, జయంతి, బాల, కన్నాంబ, గిరిజ,
రాజనాల, రేలంగి, ముక్కామల, ఋష్యేందృమణి, మిక్కిలినేని, సి.ఎస్.ఆర్., వంగర, మహంకాళి వెంకయ్య, తదితరులు నటించారు
ప్రఖ్యాత సంగీత దర్శకుడు పెండ్యాల గారి స్వరకల్పనలో పాటలన్నీ హిట్ అయ్యాయి.
“జలకాలాటలలో, కలకల పాటలలో ఏమి హాయిలే హల”
“వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా”
“ఐనదేమో ఐనదీ ప్రియ, గాన మేదే ప్రేయసీ”
“రా రా,కనరారా, కరుణ మానినారా ప్రియతమలారా”
“శివశంకరీ,శివశంకరీ,శివానందలహరీ,శివశంకరీ”
వంటి పాటలు ప్రేక్షకులను సన్మోహన పరిచాయి.
ఈ చిత్రం లోని “శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ” పాట నాటికి,నేటికీ మరువలేని పాటగానిలిచిపోయింది.
ఈ పాటకు పింగళి గారి సాహిత్యం, పెండ్యాల గారి సంగీతం, ఘంటసాల గారి గానం, ఎన్.టి ఆర్ గారి
నటన మరువలేనిది, మరపురానిది.
ఏవిధమైన గ్రాఫిక్స్ లేని ఆ రోజులలో ఈ పాటకు ఒకే వ్యక్తి ఐదు రూపాలలో వాయిద్యాలను వాయిస్తూ గానం చేయటాన్ని ముగ్ధ మనోహరంగా చిత్రీకరించారు మార్కస్ బార్ట్లే గారు. ఇప్పటికి ఈ పాటను సంగీత ప్రియులెవరూ మరచిపోలేరు.
జానపద చిత్రం లో కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు, ఏవిధమైన యుద్ధ సన్నివేశాలు లేకుండా కేవలం, సుమధురమైన పాటలు తో ఎంతో ముగ్ధమనోహరంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు దర్శకుడు కె.వి.రెడ్డి గారు..
ఈ చిత్రం లో ఎన్టీఆర్ గారు ఎంతో అందంగా ఉంటారు, ఎన్టీఆర్ గారికి జోడిగా నలుగురు హీరోయిన్లు బి.సరోజాదేవి, ఎల్.విజయలక్ష్మి.జయంతి, బాల నటించారు.
ఈ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు, మొత్తం 19 కేంద్రాలలో
17 + 2 (లేట్ రిలీజ్) కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.
విజయవాడ తో పాటు మరికొన్ని కేంద్రాలలో 100 రోజులు పైగా ఆడింది..
100 రోజులు ఆడిన కేంద్రాలు :–
1) విజయవాడ — దుర్గా కళామందిరం (128 రోజులు),
2) గుంటూరు — నాజ్,
3) నెల్లూరు — రంగమహల్,
4) విజయనగరం — శ్రీరామా,
5) విశాఖపట్నం — శ్రీలక్ష్మి,
6) కాకినాడ — క్రౌన్,
7)రాజమండ్రి — అశోక,
8)ఏలూరు — వెంకట్రామా,
9) తెనాలి — స్వరాజ్ టాకీస్,
10)గుడివాడ — శరత్,
11)మచిలీపట్నం — బృందావన్,
12)తిరుపతి – జ్యోతి,
13)కడప — రమేష్,
14)బళ్ళారి — ప్రభాత్,
15)కర్నూలు — చాంద్,
16)ఆదోని — ద్వారక,
17)మదనపల్లి — పంచరత్న,
18)బెంగళూరు — మూవీ లాండ్ (లేట్ రిలీజ్)
19)షోలాపూర్ — అలంకార్ ( లేట్ రిలీజ్).
మహారాష్ట్రలోని షోలాపూర్ లో 100 రోజులు ఆడిన మొట్ట మొదటి తెలుగు సినిమా “జగదేకవీరుని కథ”.
ఈ సినిమాను తమిళం, ఒరియా, కన్నడం, హిందీ, బెంగాలీ భాషలలో డబ్బింగ్ చేయగా, అన్ని భాషల్లోను ఈ సినిమా విజయవంతంగా ఆడింది.
మొత్తం 5 భాషల్లో డబ్బింగ్ చేయబడిన ఏకైక తెలుగు జానపద సినిమా ఇది ఒక్కటే కావటం విశేషం.